Tulasi Reddy: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వెల్లడించారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ .. రేపు ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మా నినాదమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Shabarimala: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్… బస్సుల షెడ్యూల్ ఇలా..
పొత్తుల కోసం మా కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వాఖ్యలకు తులసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు ఆస్తి, పదవి, ఇవ్వొద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేతలు చెప్పారా అంటూ ఆయన ప్రశ్నించారు. డా. సునీత పై కేసు పెట్టమని ఎవరు చెప్పారు.. రిలయన్స్ పరిమళ్ నత్వానికి పదవి ఇవ్వమని మేము చెప్పామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నా కుటుంబంలో కుట్ర చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మె న్యాయమైనదన్నారు. తల్లి, డాక్టర్ , టీచర్ , నర్స్ పాత్ర అంగన్వాడీలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తులసిరెడ్డి అన్నారు.
