రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.
Delhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలికి అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ..
- పొత్తి కడుపు సమస్యతో ఆస్పత్రిలో చేరిక
- ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం
- గత డిసెంబర్‌లో 78 ఏళ్ళు పూర్తి చేసుకు సోనియా గాంధీ

Soniagandhi