NTV Telugu Site icon

Marsukola Saraswathi: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు.. అమ్ముకున్నారని సరస్వతి తీవ్ర ఆరోపణలు

Marsukola Saraswathi

Marsukola Saraswathi

Marsukola Saraswathi: కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ చిచ్చు జరుగుతోంది. ఆదివాసీలకు అన్యాయం చేశారంటూ టికెట్ ఆశించిన మర్సుకోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఆమె భంగపడ్డారు. ఆదివాసీలతో సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తామని ఈ సందర్భంగా ఆదివాసీలు హెచ్చరించారు.

Also Read: Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య.. పోచారం కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధిష్టానం తనను మోసం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీస్కొని శ్యామ్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని సరస్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్యామ్ నాయక్ ఓ అవినీతి పరుడు అని.. భోరజ్ చెక్ పోస్ట్ కిందిస్థాయి ఉద్యోగులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారని.. ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నాడని, ఇక్కడకు వచ్చి నీతులు చెప్తున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. తన భార్య రేఖానాయక్‌కు కేసీఆర్ అన్యాయం చేశాడని ఇప్పుడు అంటున్నాడని ఆమె విమర్శించారు. ఖానాపూర్‌లో శ్యామ్ నాయక్ భార్యా రేఖా నాయక్‌కు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. మూడోసారి కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. రేఖానాయక్ అవినీతి, అక్రమాల వల్లే టికెట్ ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీకి తెలియదా అంటూ మండిపడ్డారు.

Also Read: Minister KTR : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు.. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే

టీపీసీసీ జనరల్ సెక్రటరీతో పాటు మరో పదవికి రాజీనామా చేస్తున్నట్టు మర్సుకోల సరస్వతి తెలిపారు. ఆదీవాసుల దగ్గర డబ్బులు ఉండవని, డబ్బున్నవారికి టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ కేటాయించకుండా, పారాషూట్లకు టికెట్ ఇవ్వడం తప్పు అంటూ వ్యాఖ్యానించారు. అధిష్టానం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ ఆమె మండిపడ్డారు. ఉదయపూర్ డిక్లరేషన్‌లో చెప్పింది ఏమైందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆమె ఆరోపించారు. శ్యాం నాయక్‌ని ఓడించడానికి గడపగడపకు పోయి ప్రచారం చేస్తానన్నారు. నియోజకవర్గ ఏర్పడినప్పటి నుంచి ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుంది… ఇప్పటివరకు ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ. ఆదివాసులకు టికెట్ కేటాయించిందన్నారు. కానీ ఈసారి లంబాడీ అభ్యర్థికి టికెట్ కేటాయించడం సమంజసం కాదన్నారు మర్సుకోల సరస్వతి.

Show comments