NTV Telugu Site icon

Big Breaking: ఇండియా కూటమి ఛైర్మన్ గా మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవం

Kharge

Kharge

Mallikarjun Kharge: ఇవాళ ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో పాల్గొనింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కూటమి ఛైర్మన్ గా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను కూటమికి సమన్వయకర్తగా ఎన్నిక అయ్యారు. దాదాపుగా కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో పాటు సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా ప్రధానంగా చర్చించారు.

Read Also: Minister Jogi Ramesh: ప్రజాయుద్ధంలో ఎవరూ జగన్‌ను ఓడించలేరు.. 20 ఏళ్లు జగన్‌ పాలనే..!

అయితే, కోఆర్డినేటర్‌ పదవి ప్రతిపాదనపై నితీష్‌ కుమార్‌ మొదట మాట్లాడుతూ.. నాకు ఏ పదవి పైనా కోరిక లేదన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతి పాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు. ఇక, ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు.