Jaggareddy: అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్డీఏ తగ్గుతోందని.. ఇండియా కూటమి పెరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేల చేరిక అంశం తన పరిధి కాదన్నారు. అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా అని ఆయన అన్నారు. కేసీఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుంది అనేది తెలియదు కానీ ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన మా దగ్గర ఉందన్నారు. ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.
Read Also: Heat Wave: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలివే!
వంద మంది ఉన్న కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారని.. మేము ఇక్కడ పాండవులం అని ఆయన అన్నారు. నార్త్‌లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి.. మూడో ప్లేస్‌లో ఉన్న బీజేపీ సోషల్ మీడియాలో మాత్రం బీజేపీ ముందు ఉంది అని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఎన్డీఏ తగ్గుతోందని.. ఇండియా కూటమి పెరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్లనే ఇండియా కూటమి గ్రాఫ్ పెరిగిందన్నారు.