NTV Telugu Site icon

Mahesh Kuma Goud : ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.. మేయర్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

అంబర్ పేటలో కుక్కల దాడిపై హెచ్‌ఆర్‌సీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్ రేస్ మీద ఉన్న దృష్టి.. మున్సిపల్ శాఖ లో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక కేటీఆర్ కు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.. మేయర్ ఏం చేస్తుందో ఏవరికీ తెలియదని ఆయన ఆరోపించారు. హెచ్ఆర్సీ కి జడ్జి లేక రెండు నెలలు అవుతున్నా.. జడ్జిని నియమించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం.. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ.. గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవికి అనర్హురాలన్నారు.

Also Read : GHMC : మేయర్ విజయలక్ష్మిపై బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం.. ఆమె ప్రెస్ మీట్‌కే పరిమతమంటూ

కేటీఆర్‌కు ఎలక్షన్ మీద ఉన్న దృష్టి.. ప్రజా సమస్యలపై లేదని ఆయన విమర్శించారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. హెచ్ ఆర్సీలో ఖాళీ కుర్చిలే దర్శనం ఇస్తున్నాయని, కుక్క చనోపోతే కేసు బుక్ చేస్తరు..అదే కుక్క మనిషిని కరిస్తే కేస్ బుక్ చేయరా అని ఆయన అన్నారు. బాలుడి మరణానికి కారణం అయిన వారిపై చర్యలు ఏవి అని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సరం 80 వేల మంది కుక్క కాటుకు గురయ్యారన్నారు. కేటీఆర్ గచ్చిబౌలి, కోకపేట్ చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారని, కేటీఆర్ నాతో రా సమస్యలు ఎన్ని ఉన్నాయో చూపిస్తా అని ఆయన సవాల్‌ విసిరారు. సమస్య వస్తేనే.. జీహెచ్ఎంసీకి గుర్తోస్తుందా అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కూతూరో కోడుకో ఆ బాలుడు స్థానంలో ఉంటే.. ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Mystery Revealed : మిస్సింగ్‌ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో