NTV Telugu Site icon

Acharya Pramod: ప్రియాంక గాంధీ చాలా పాపులర్ ఫేస్.. ప్రధాని అభ్యర్థిని చేయండి..!

Priyanka

Priyanka

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది తానే నిర్ణయిస్తానని ఆయన శనివారం అన్నారు. వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ విషయానికి వస్తే, ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం మంచిదన్నారు. అప్పుడు దేశం మొత్తం మోడీ వర్సెస్ ప్రియాంక గాంధీలా మారుతుందని వ్యాఖ్యలు చేశారు.

Science and Sravanam: శ్రావణ మాసంలో నో నాన్‌వెజ్‌..! దాని వెనుక ఇంతక కథ ఉందా..?

అంతకుముందు అజయ్ రాయ్ ఏం చెప్పాడంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని శుక్రవారం (ఆగస్టు 18) ప్రకటించారు. ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అక్కడి నుంచి పోటీ చేయచ్చని కూడా ఆయన చెప్పారు. కావాలంటే వారణాసి నుంచి పోటీ చేయవచ్చని అజయ్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆచార్య ప్రమోద్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ చాలా పాపులర్ ఫేస్ అని, తమకు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థి కావాలన్నారు. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తే తాము ఆమెకు సహాయం చేస్తామన్నారు.

Kiara Advani : బోల్డ్ ఫోటో షూట్ తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ..

మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ దాదాపు 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం చాలా కాలంగా గాంధీ కుటుంబానికి బలమైన కోటగా ఉండేది. 2004 నుండి రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తుండగా.. గతంలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందారు.

Show comments