Congress Bus Yatra: కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రజాధ్వని ప్రచార లోగోను ఆవిష్కరిస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన 90శాతం కంటే ఎక్కువ వాగ్దానాలను మరచిపోయి.. 40శాతం కమీషన్‌తో విచ్చలవిడిగా దోచుకోవడంలో బీజేపీ బిజీగా మారడంతో కర్ణాటక అభివృద్ధి వెనుకబడిపోయిందని ఆయన ఆరోపించారు.
‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ విఫలమైందంటూ వారి విధానాలను ఎత్తిచూపిన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య .. బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపేందుకు, బీజేపీ ప్రభుత్వ అబద్ధాలను బట్టబయలు చేసేందుకు ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో యాత్రలు ప్రారంభిస్తామన్నారు. సమయాభావం కారణంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్యల నేతృత్వంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విభజించబడింది. 2023లో రాష్ట్ర ఎన్నికలకు వెళ్లే ముందు నాయకులు కర్ణాటక మొత్తాన్ని కవర్ చేసేలా బస్సు యాత్ర బహుళ దశల్లో చేపట్టబడుతుంది. మొదటి దశలో సిద్ధరామయ్య ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. డీకే శివకుమార్ పాత మైసూరు ప్రాంతంలో ప్రచారం చేయనున్నారు. రెండో దశలో మళ్లీ దక్షిణ, ఉత్తర కర్ణాటకలను కవర్ చేయనున్నారు.
Joshimath: జోషిమఠ్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. 16న సుప్రీం విచారణ
“ప్రజలు ప్రభుత్వంతో విసిగిపోయారు. ద్వేషపూరిత రాజకీయాలు, ప్రతీకార రాజకీయాల కారణంగా ప్రజలు శాంతియుతంగా జీవించలేకపోతున్నారు. శాంతిభద్రతల యంత్రాంగం ప్రజలను విఫలం చేసింది” అని సిద్ధరామయ్య అన్నారు. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా కర్ణాటకను రెండో స్థానంలో నిలిపిందని, కర్ణాటకలోని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపించింది. 40శాతం కమీషన్‌పై బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల మహమ్మారి సమయంలో 3.5 లక్షల మందికి పైగా కన్నడిగులు మరణించారు. అమాయక కాంట్రాక్టర్‌లను ఆత్మహత్యల్లోకి నెట్టారని అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ బొమ్మెని తోలుబొమ్మలా అభివర్ణించింది. బొమ్మై హైకమాండ్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, కర్ణాటక ఆకాంక్షలను విస్మరించారని, కన్నడిగుల గొంతును అణచివేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
