NTV Telugu Site icon

Congress Jana Garjana Meeting Live Updates : తెలంగాణలో అధికారంలోకి వస్తే.. మొదటి సంతకం చేయూత పథకంపైనే

Janagarjana

Janagarjana

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అడుగడుగునా ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్‌లో ఖమ్మం పట్టణానికి చేరుకుని అక్కడ ‘తెలంగాణ జన గర్జన’ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే.. సభకు 5 లక్షల మందికిపైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. 55 అడుగుల ఎత్తు, 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చునే డయాస్‌ను ఏర్పాటు చేసి, 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్…. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్ తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా… పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా… ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

The liveblog has ended.
  • 02 Jul 2023 07:35 PM (IST)

    చేయూత పథకంపైనే మొదటి సంతకం : కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

    ప్రతి నెల రూ.4వేల పెన్షన్‌ ప్రకటించిన రాహుల్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేయూత పథకంపైనే మొదటి సంతకం.

  • 02 Jul 2023 07:23 PM (IST)

    కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌కు తరమాలి : రేవంత్‌ రెడ్డి

    60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చింది. 1200 మంది ఆత్మబలిదానాలకు సోనియా చలించిపోయారు. బలిదానాలు చూడలేకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను కొల్లగొట్టింది. ఖమ్మం సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బస్సులు ఇవ్వలేదు, లారీలను అడ్డుకున్నారు. కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌కు తరమాలి. రాహుల్ సమక్షంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ప్రకటించాం. ప్రియాంక సమక్షంలో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించాం. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం.

  • 02 Jul 2023 07:16 PM (IST)

    ఖమ్మం సభలో ఎన్నికల హామీలను ప్రకటించిన రాహుల్‌ గాంధీ

    ఖమ్మం సభలో ఎన్నికల హామీలను ప్రకటించిన రాహుల్‌ గాంధీ. కాంగ్రెస్‌ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పెన్షన్‌. చేయూత పథకం ద్వారా అందిస్తాం. పోడు భూములను ఆదివాసులకు ఇస్తాం.

  • 02 Jul 2023 07:14 PM (IST)

    తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయింది : రాహుల్

    తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్‌ మధ్య మాత్రమే పోటీ. కర్నాటక తరహాలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తాం. తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలు వస్తాయి. విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్‌ఎస్‌ను పిలవాలని కొని పార్టీలు కోరాయి. బీఆర్‌ఎస్‌ వస్తే కాంగ్రెస్‌ హాజరుకాదని స్పష్టంగా చెప్పాం. కాంగ్రెస్‌లోకి వచ్చేవారి కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఐడియాలజీ వారితో మాకు సంబంధం లేదు. కేసీఆర్‌ స్కామ్‌లు మోడీకి తెలిసినా పట్టించుకోవడం లేదు. మేం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతాం.

  • 02 Jul 2023 06:57 PM (IST)

    భారత్‌ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉంది : రాహుల్

    భారత్‌ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్‌ ఐడియాలజీ దేశాన్ని కలపడం, ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విభజించడం. దేశమంతా భారత్‌ జోడో యాత్రను సమర్థించింది. జోడో యాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. ప్రజల మనసులో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. అందుకే మీరు కాంగ్రెస్‌ ఆలోచనలు సమర్థించారు. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నా. భట్టి తెలంగాణలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారు. పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను నేను అభినందిస్తున్నాను. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు మీరందరు శక్తినిచ్చారు. తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది. తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం ధ్వంసం చేసింది.

  • 02 Jul 2023 06:50 PM (IST)

    బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయాల్సిందే. -భట్టి

    బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయాల్సిందే. ధరణి అనే మహమ్మారిని తీసుకువచ్చారు. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం. ఉద్యోగాలు రాక యువకులు తల్లడిల్లుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచిన ఏ ఒక్క ఎకరా భూమిని లాకున్నా చూస్తూ ఊరుకోబోం. -భట్టి

  • 02 Jul 2023 06:41 PM (IST)

    పీపుల్స్‌ మార్చ్‌ నా పాదయాత్ర కాదు : భట్టి

    భారత్‌ జోడోయాత్రకు కొనసాగింపే పీపుల్స్‌ మార్చ్‌. పీపుల్స్‌ మార్చ్‌ను ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మొదలు పెట్టాను. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకున్నా. పీపుల్స్‌ మార్చ్‌ నా పాదయాత్ర కాదు.. అధికార మదంతో విర్రవీగుతున్నవారికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన యాత్ర ఇది. దేశమంతా ఒకటిగా ఉండాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ నడిచారు. రాష్ట్ర సంపదను కేసీఆర్‌ కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారు. పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ధరణికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు నాతో చెప్పారు.

  • 02 Jul 2023 06:29 PM (IST)

    వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే : పొంగులేటి

    విద్యార్థుల పోరాటంతో సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు రుణమాఫీ లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రెండుసార్లు కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక హామీలన్నీ నెరవేర్చుతాం. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్‌ చచ్చిపోతుందని తెలిసినా ఇచ్చారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. డిక్లరేషన్‌లో ప్రకటించినవన్నీ కాంగ్రెస్‌ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలపడం కాంగ్రెస్‌తోనే సాధ్యం.

  • 02 Jul 2023 06:15 PM (IST)

    ఇది కాంగ్రెస్ పాదయాత్ర ముగింపు కాదు : మధు యాష్కీ

    ఇది కాంగ్రెస్ పాదయాత్ర ముగింపు కాదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పతనానికి ఆరంభం.

  • 02 Jul 2023 06:11 PM (IST)

    పూర్తయిన భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర.

    పూర్తయిన భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు సాగిన భట్టి పాదయాత్ర. 1360 కిలోమీటర్లు సాగిన భట్టి పాదయాత్ర. 109 రోజుల పాటు సాగిన భట్టి పాదయాత్ర. 36 నియోజకవర్గాల మీదుగా సాగిన భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర.

  • 02 Jul 2023 06:08 PM (IST)

    కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి.

    కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి. కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్‌.

  • 02 Jul 2023 05:54 PM (IST)

    సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్‌

    ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్‌. కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్న భట్టి పాదయాత్ర.

  • 02 Jul 2023 05:48 PM (IST)

    ఖమ్మం చేరుకున్న రాహుల్‌ గాంధీ

    ఖమ్మం చేరుకున్న రాహుల్‌ గాంధీ. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి రాహుల్‌. జనగర్జన సభలో భట్టి విక్రమార్కను సన్మానించనున్న రాహుల్‌.

  • 02 Jul 2023 05:23 PM (IST)

    హెలికాప్టర్‌లో ఖమ్మం బయలుదేరిన రాహుల్ గాంధీ

    గన్నవరంలో రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్ ఎక్కి ఖమ్మం బయలుదేరారు. హెలికాప్టర్‌లో రాహుల్‌తో పాటు మాణిక్కం  ఠాకూర్, జె.డి.శీలం, గిడుగు రుద్రరాజు ఉన్నారు.

  • 02 Jul 2023 05:04 PM (IST)

    ప్రారంభమైన తెలంగాణ జనగర్జన సభ

    సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన తెలంగాణ జనగర్జన సభ.. స్టేజ్ పై 150 మంది కూర్చునేలా ఏర్పాట్లు. ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్న పొన్నాల.. వీహెచ్‌.. మల్లు రవి తదితరులు.

  • 02 Jul 2023 04:53 PM (IST)

    ప్రజలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం : ఉత్తమ్‌

    తెలంగాణలో గొప్ప పాదయాత్ర భట్టిది. రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ప్రజలను అడ్డుకోవాలని అనుకోవడం అవివేకం.

  • 02 Jul 2023 04:23 PM (IST)

    బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు : తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే

    బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దోపిడీ చేశారు. దోపిడీ సొమ్ముతో మహారాష్ట్రలో కేసీఆర్ తన పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..? బీఆర్ఎస్, బీజేపీలు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఓడిద్దామనుకుంటున్నారు.. కానీ అది సాధ్యం కాదు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని అందరికీ అర్థమైపోయింది. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ పాల్గొంటుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెస్తుంది. ఖమ్మంలో భారీ సభ జరగుతోంది. భట్టి పాదయాత్ర ముగిసింది.. అలాగే చేరికలు ఉన్నాయి. ఇచ్చిన హామీలు కేసీఆర్ నేరవేర్చలేదు.

  • 02 Jul 2023 04:06 PM (IST)

    రాహుల్‌ గాంధీ వస్తున్నారంటే ఎందుకంత టెన్షన్‌ -పొన్నాల

    రాహుల్‌ గాంధీ వస్తున్నారంటే ఎందుకంత టెన్షన్‌. దేశ ఆర్థిక మూలాలను నిలబెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వివరిస్తుంది కేసీఆర్‌ ప్రభుత్వం. -పొన్నాల

  • 02 Jul 2023 04:06 PM (IST)

    కాసేపట్లో ఖమ్మంలో కాంగ్రెస్‌ జనగర్జన సభ.

    కాసేపట్లో ఖమ్మంలో కాంగ్రెస్‌ జనగర్జన సభ. భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు సభ. హాజరుకానున్న రాహుల్‌ గాంధీ, ముఖ్యనేతలు. జనగర్జన సభకు తరలివస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు.