Site icon NTV Telugu

Congress 3rd List: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

Congress

Congress

Congress 2nd List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా.. తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. ఐదుగురు అభ్యర్థులలో పెద్దపల్లి- గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి-సునీత మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌-దానం నాగేందర్‌, చేవెళ్ల-రంజిత్‌ రెడ్డి, నాగర్ కర్నూల్‌-మల్లు రవి పేర్లను అధిష్ఠానం వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా 8 స్థానాలు హస్తంపార్టీ అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది.

మిగిలిన 8 లోకసభ స్థానాల అభ్యర్దుల ఖరారుపై కసరత్తు కొనసాగనుంది. ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్‌, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్ ఖరారు చేయనుంది.

అభ్యర్థుల జాబితా ఇదే..

1. చేవెళ్ల – రంజిత్ రెడ్డి

2. నాగర్ కర్నూల్ – మల్లు రవి

3. మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి

4. పెద్దపెల్లి – గడ్డం వంశీ

5. సికింద్రాబాద్ – దానం నాగేందర్.

Exit mobile version