Site icon NTV Telugu

Mallikarjun Kharge: మోడీ మళ్లీ గెలిస్తే.. ఇకపై ఎన్నికలుండవు

Congress Chief

Congress Chief

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (PM Modi) మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

కర్ణాటకలోని మంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పాల్గొని ప్రసంగించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ (PM Modi) నియంత అవుతారని వ్యా్ఖ్యానించారు. మోడీ తిరిగి బీజేపీ ప్రభుత్వాన్నితీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు., మీడియా, ఈడీ, ఆదాయపు పన్ను, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి స్వతంత్ర సంస్థలను మోడీ నియంత్రిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీని శక్తివంతం చేయవద్దని.. నియంతని చేయవద్దు అని ఆయన కోరారు. ఒకవేళ గెలిస్తే మోడీ నియంతగా మారతారని.. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని ఖర్గే హెచ్చరించారు.

 

ఇదిలా ఉంటే 2024 ఎన్నికలే అజెండాగా నేటి నుంచి రెండ్రోజుల పాటు ఢిల్లీ బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.

 

మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టివస్తున్నారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. మరీ వచ్చే ఎన్నికల్లో ఎవర్ని విజయం వరిస్తుందో వేచి చూడాలి.

 

Exit mobile version