Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Cec Meeting Discussion On 62 Seats In 6 States Second List To Be Released Today

Congress : కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!

Published Date :March 12, 2024 , 8:12 am
By Rakesh Reddy
Congress : కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Congress : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) రెండో సమావేశం సోమవారం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో 6 రాష్ట్రాల్లోని 62 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించగా, అందులో దాదాపు 40 సీట్లకు ఆమోదం లభించింది. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పేర్లు ఈ జాబితాలో చేర్చవచ్చు.

రాజస్థాన్‌లోని జలోర్-సిరోహి స్థానం నుంచి వైభవ్ గెహ్లాట్ పేరు ఆమోదం పొందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కశ్వాన్ ప్రస్తుత పార్లమెంట్ నియోజకవర్గం చురు నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టోంక్‌ సవాయ్‌ మాధోపూర్‌ నుంచి హరీశ్‌ మీనాను అభ్యర్థిగా బరిలోకి దింపవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని సమాచారం.

Read Also:Realme Narzo 70 Pro 5G Price: మార్చి 19న మార్కెట్‌లోకి రియల్‌మీ నార్జో 70 ప్రో.. ధర, ఫీచర్లివే!

ఈ రాష్ట్రాల సీట్లపై చర్చ
ఈ సమావేశంలో రాజస్థాన్‌లోని 13, మధ్యప్రదేశ్‌లోని 16, ఉత్తరాఖండ్‌లోని 5, గుజరాత్‌లోని 14, అస్సాంలోని 13, కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలోని ఒక సీటుపై చర్చించారు. ఢిల్లీపై చర్చ జరగలేదు. దీంతోపాటు సోమవారం యూపీకి చెందిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరిగిందని, అక్కడి నుంచి సీఈసీకి రాగానే పేర్లపై చర్చిస్తామన్నారు. తదుపరి సమావేశం మార్చి 15న జరిగే అవకాశం ఉంది.

దాదాపు 40 మంది పేర్లు
ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఈసీలోని పలువురు నేతలు, ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్, డామన్ డయ్యూలకు 62 మంది అభ్యర్థుల పేర్లను చర్చించారు. వారిలో 40 మంది పేర్లను ఆమోదించారు.

Read Also:Amit Shah: నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ
39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది. అందులో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress candidate second list
  • congress CEC meeting
  • discussion on 62 seats in 6 states

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions