NTV Telugu Site icon

Graduate MLC : తుది దశకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న

Graduate Mlc

Graduate Mlc

Graduate MLC : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న విజయం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ 50 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు.  బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా ఎలిమినేట్ అయ్యారు. దీంతో గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్‌ తర్వాత కూడా మల్లన్న ఆధిక్యంలో ఉండటంతో గెలుపు ఖాయమనే అంచనాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం 13 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. తుదిఫలితం కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, అభిమానులు చేరుకుంటున్నారు. బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

 

Read Also: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..