సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక అభ్యర్థుల తరపున పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థులైతే.. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రచార సభలో కాంగ్రెస్ అభ్యర్థి భోరున విలపించారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల స్టంట్‌లో భాగమని కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Telangana: కాంగ్రెస్ జైత్రయాత్రకు నాందిగా ‘జనజాతర’.. 6న భారీ బహిరంగ సభ
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తార్వార్ సింగ్ లోధి బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే సభలో ఆ పార్టీ నాయకుడు జితు పట్వారీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి తార్వార్ సింగ్ లోధి దగ్గర డబ్బులేదు గానీ.. అతనిలో మాత్రం నిజాయితీ ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అతడు మీ కొడుకు.. మీ సోదరుడు.. మీ కుటుంబ సభ్యుడు అని చెప్పగానే స్టేజ్‌పైనే తార్వార్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతను మాట్లాడినంత సేపు ఏడుస్తూనే ఉన్నారు. దీంతో సహచర నాయకులంతా తార్వార్ సింగ్‌ను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Allu Ayan : నా చిన్ని బాబు.. నా ప్రాణం అల్లు అయాన్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెష్..
అయితే ఈ సంఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోధి మాట్లాడుతూ.. పొలిటికల్ స్టంట్ అంటూ కొట్టిపారేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఇంతగా ఏడ్వాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. దామోహ్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎలాంటి అవకాశం లేదన్న ఆలోచనతో ఏడ్చి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని.. తనకైతే ఆశ్చర్యం కలుగుతుందని రాహుల్ లోధి పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న పోలింగ్ జరగనుంది. దామోహ్‌తో సహా మరో ఆరు పార్లమెంట్ స్థానాలకు ఈ నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Manda Krishna: తన బిడ్డ భవిష్యత్ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్
