టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బన్నీ కొడుకుగా మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.. చిన్న వయసులోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అయాన్..నేడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ విషెష్ తెలుపుతున్నారు..
అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని సరదాగా పిలుచుకుంటారు.. ఇక అల్లు అర్జున్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అయాన్ గురించి మోడల్ అన్నట్టు సింబల్ చూపించాడు. దానికే మోడల్ అయాన్ అంటూ బాగా వైరల్ అయ్యాడు.. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించిన తనలోని ఏదొక టాలెంట్ బయటపెడుతూ అందరిని ఆకట్టుకుంటాడు.. మొన్నీమధ్య షారుఖ్ పాటను పాడాడు.. ఆ వీడియో ఇప్పటికి వైరల్ అవుతుంది…
ఇక నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో అయాన్‌కు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. నా చిన్ని బాబు.. నా ప్రాణం అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ చేశాడు.. ఎంత బిజీగా ఉన్న కొడుకు పుట్టినరోజును మిస్ అవ్వడు అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే విడుదల కాబోతుంది..
Happy Birthday to the love of my life #alluayaan #nachinnibabu #mynaughtystar pic.twitter.com/x11P9WaHVu
— Allu Arjun (@alluarjun) April 3, 2024