NTV Telugu Site icon

Jagadeeshwar Goud: మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud: మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారా నగర్‌లో జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులో మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికైన ప్రయాణించే వెలుసుబాటు తమ ప్రభుత్వం కల్పిస్తుందని దానికి తోడు వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇవ్వనున్నట్లు జగదీశ్వర్ వివరించారు.

Also Read: Revanth Reddy Fire On KCR: నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి

అక్షరాస్యతను పెంపొందించేందుకు కేజీ టూ పీజీ వరకు స్కాలర్ షిప్ అందించేందుకు రాష్ట్ర నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. అన్ని వర్గాలను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండడంతో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జగదీశ్వర్ గౌడ్ వివరించారు. అంతకుముందు జగదీశ్వర్ తారానగరంలోని తుల్జా భవాని ఆలయంలో పూజలు చేసి పాదయాత్రకు బయలుదేరారు.

Show comments