NTV Telugu Site icon

House Arrest : సీఎం జగిత్యాల టూర్‌.. ఎక్కడికక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌..

Congress Bjp

Congress Bjp

సీఎం కేసీఆర్‌ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. స్థానిక నేతలతో పాటు పరిసర పట్టణాలకు చెందిన విపక్ష నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ టూర్‌ ప్రశాంతంగా జరిగేందుకు.. కేసీఆర్‌ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే జగిత్యాలతో పాటు.. వేములవాడకు చెందిన పలవువురు కాంగ్రెస్‌, బీజేపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేయడంపై బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం కేసీఆర్‌ నియంతల వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కేసీఆర్‌ ఆగడాలను ప్రజలకు గమనిస్తున్నారంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ నేతలు. అయితే.. 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకుంటారు.
Also Read : FIFA World Cup: పోర్చుగల్‌ గోల్స్ మోత.. ప్రపంచకప్ నుంచి స్విట్జర్లాండ్ నిష్క్రమణ

12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు వచ్చి… 12 గంటల 40 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన.. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేస్తారు సీఎం కేసీఆర్‌. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అక్కడే లంచ్ ఏర్పాటు ఉంటుంది. 3 గంటల 10 నిమిషాలకు రోడ్ వే ద్వారా ప్రత్యేక బస్సులో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు సీఎం కేసీఆర్‌. 4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు.