అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. వీటన్నింటి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.. రేవంత్ రెడ్డి హోమ్ మంత్రిగా ఉండి ఆ కేసును ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండగానే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును జైలులో వేస్తానని బహిరంగంగా చెప్పారు.. సీఎం కాగానే దురుద్దేశంతో తనకు ఇష్టం లేని అధికారులపై ఈ ప్రభుత్వం వేధింపులు మొదలు పెట్టింది అని మండిపడ్డారు.
Read Also: BRS: ఈనెల 18న బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల సమావేశం..
ఇక, ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఆరు రోజుల ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక డీసీపీ, విచారణాధికారి పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కేసును ఎన్నికల సంఘం పర్యవేక్షణ కిందకు తేవాలి.. సీపీ సహా రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నా.. పోలీస్ అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు జైలు శిక్ష తప్పదని మాట్లాడటాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించాలి.. రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈసీ ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరినట్లు పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.
