TPCC: రేవంత్ రెడ్డి సోమవారం హనుమకొండలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. యాత్రలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్‌పైన దాడి జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను విమర్శిస్తూ కొన్ని కొటేషన్‌లతో కూడిన ఫ్లెక్సీని పట్టుకొని రేవంత్‌రెడ్డి వచ్చే మార్గంలో ఆయన నిల్చున్నారు. ఈ క్రమంలో పక్కనే మాటు వేసి ఉన్న కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పవన్‌ను వెంబడించారు. పరుగెత్తుతుండగా పట్టుకుని పక్కనే ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి చితకబాదారు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో రక్తపు మడుగులో ఉన్న పవన్‌ను వదిలేసి, పారిపోయారు. పవన్ తల్లి భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Dog Attack: నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. తీవ్రగాయాలతో మృతి
వరంగల్ లో యూత్ కాంగ్రెస్ నేతపై దాడికి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపునిచ్చింది. అలాగే వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు చేయాలని తలంచింది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన, అతడి కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ గుండాల దౌర్జన్యాలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని నియోజక వర్గ కేంద్రాలలో నేడు కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి బీఆర్ఎస్ గుండాల వైఖరిని ఎండగడుతూ మీడియాలో మాట్లాడాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. అలాగే వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.