Site icon NTV Telugu

AAP- Congress: నేడు కాంగ్రెస్- ఆప్ సీట్ల సర్దుబాటు చర్చలు..

App Congress

App Congress

Seat-Sharing: లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది.‘భారత’ కూటమిలో చేరిన పార్టీల మధ్య సీట్ల పంపకాల కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ మధ్య కీలక సమావేశం జరగనుంది. నేటి సాయంత్రం 6:30 గంటలకు ముకుల్ వాస్నిక్ ఇంట్లో ఇరు పార్టీల నేతలు మరోసారి కలిసి సీట్ల పంపకాలపై చర్చించుకోనున్నారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చ జరగనుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనేది స్పష్టమవుతోంది.

Read Also: Sri Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

అయితే, అంతకుముందు సోమవారం నాడు కాంగ్రెస్- ఆప్ మధ్య మొదటి సమావేశం జరిగింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఈ మీటింగ్ కి హాజరు కాగా.. కాంగ్రెస్ తరఫున రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, వాస్నిక్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం వాస్నిక్ మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయి.. రెండో రౌండ్ సమావేశం తర్వాత సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read Also: Girl Delivers Baby: ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ.. బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని!

ఇక, ఆమ్ ఆద్మీ సీనియర్ నేత, మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఆప్ పార్టీకి ఐదు రాష్ట్రాల్లో వాటా కావాలని బహిరంగంగా తెలియజేశారు. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు హర్యానా, గోవా, గుజరాత్‌లలో కూడా తమ పార్టీ కాంగ్రెస్ నుంచి సీట్లు కావాలని పేర్కొన్నారు. ఇక, హైకమాండ్‌తో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ నేతలు తమ వైఖరిని వెల్లడిస్తామని చెప్పారు.. దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత సీట్లపై చర్చ జరుగుతుంది.

Read Also: Sankranti Holidays: నేటి నుంచి తెలంగాణలో సంక్రాంతి సెలవులు..

అయితే, ఐదు రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ మధ్య పొత్తు కీలకం కాబోతుంది. పంజాబ్ మినహా కాంగ్రెస్- ఆప్ మధ్య చర్చలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఢిల్లీలో 7, పంజాబ్‌లో 13, హర్యానాలో 10, గుజరాత్‌లో 26, గోవాలో 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ 58 సీట్లలో ఆప్‌కి ఎన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version