Site icon NTV Telugu

Polavaram: అక్కడ పోటీ చేసేది ఎవరు..? టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల్లో అయోమయం..!

Polavaram

Polavaram

Polavaram: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉన్న నియోజకవర్గం పోలవరం. అక్కడ పొత్తు రాజకీయం మూడు పార్టీల కేడర్‌లో గందరగోళానికి కారణమైంది. వచ్చే ఎన్నికల్లో కీలకంగా నిలిచే పోలవరం నుంచి.. వచ్చే ఎన్నికల్లో.. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీంతో సీటు ఎవరికి దక్కుతుంగా అని ఆశావహులు, ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెల్చిన బోరగం శ్రీనివాస్ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన నుంచి చిర్రి బాలరాజు బరిలో దిగేందుకు సై అంటున్నారు. పొత్తులో భాగంగా ఏలూరు పార్లమెంటు సీటును బీజేపీకి ఇస్తే.. పోలవరంలో కమలం పార్టీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుంటే.. టీడీపీ, జనసేన 14 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. పోలవరాన్ని పెండింగ్‌లో ఉంచింది.

Read Also: Penamaluru: రసవత్తరంగా పెనమలూరు టీడీపీ రాజకీయం..!

ఓవైపు వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థి పేరును ప్రకటించకపోవడంతో.. మూడు పార్టీల నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. ప్రచారానికి సమయం సరిపోకుంటే పరిస్థితి ఏంటి.. అని ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే పోలవరంలో గతంలో గెలిచిన అనుభవం టీడీపీకి ఉంది. సైకిల్ పార్టీకి కాకుండా మరో పార్టీకి సీటు కేటాయిస్తే.. కూటమి అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా సమయం పడుతుందనే వారి అభిప్రాయం. ముఖ్యంగా పోలవరం ఎజెన్సీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం అంత సులువు కాదంటున్నారు స్థానిక నేతలు. పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనే విషయంపై క్లారిటీ వస్తే తప్ప.. పోలవరం అసెంబ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.

Exit mobile version