NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి టికెట్స్ పై కన్ఫ్యూషన్.. నాకేం సంబంధం లేదన్న రాజశేఖర్..

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కించారు.ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో మేకర్స్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు.ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఉండటంతో బుకింగ్స్ ప్రారంభం అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.అయితే టికెట్స్ ప్లాట్ ఫామ్ ‘బుక్ మై షో ‘లో ఓ కన్ఫ్యూషన్ మొదలైంది.

Read Also :SSMB29 : రాజమౌళి, మహేష్ మూవీ ప్రారంభం ఇప్పట్లో లేనట్టేనా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ,హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో గతంలో ‘కల్కి’ అనే సినిమా వచ్చింది.దీనితో ప్రభాస్ కల్కి కోసం టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకునే వారు పొరపాటున రాజశేఖర్ కల్కి సినిమాను బుక్ చేసుకున్నారు.దీనితో వారు ఆందోళన చెందుతుండగా ఆ విషయం పై ‘బుక్ మై షో’ క్లారిటీ ఇచ్చింది.రాజశేఖర్ కల్కి సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు ప్రభాస్ సినిమాకే టికెట్స్ బుక్ చేసుకున్నట్లని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది.అలాగే ప్రభాస్ కల్కిసినిమా కాకుండా రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లను ప్రజలు బుక్ చేసుకున్నారని, భ్రమరాంబ థియేటర్లలో ఏకంగా 6 షోలు ఫుల్ అయ్యాయని ఓ ట్వీట్ పోస్ట్ కాగా దీనికి రాజశేఖర్ సరదాగా స్పందించారు. “నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే..ప్రభాస్ కల్కి టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. ఈ సినిమా చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా” అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

Show comments