తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వివాదం ముష్టిఘాతాల స్థాయికి చేరుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడానికి ఎంపీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదన పార్లమెంటులో చర్చకు వచ్చాయి. ఈ సమయంలో ఎంపీల మధ్య గొడవ జరిగింది. ఎంపీలు ఫైళ్లను లాక్కొని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. మరొక వీడియోలో కొంతమంది ఎంపీలు స్పీకర్ సీటును చుట్టుముట్టారు. చాలా మంది టేబుల్‌పైకి దూకడం, మరి కొందరు తమ సహోద్యోగులను నేలపైకి లాగడం వంచి దృశ్యాలు కనిపించాయి.
READ MORE: CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్.. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!
అధ్యక్షుడిగా ఎన్నికైన లై చింగ్-తే శాసనసభ మెజారిటీ లేకుండా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందు ఈ వివాదం జరిగింది. పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు చేసే అధికారులను నేరంగా పరిగణించే కొత్త తీర్పుపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP), కోమింటాంగ్ (KMT) పోరాడుతున్నట్లు తెలిసింది. సభ్యులు సభలోకి రాకముందే చర్చ వాడివేడిగా మారి సభ వెలుపల సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచినప్పటికీ లై డీపీపీ పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే వివాదం నెలకొంది. ప్రతిపక్ష కెఎమ్‌టీకి డీపీపీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయని, అయితే మెజారిటీని ఏర్పాటు చేయడానికి సరిపోదని నివేదిక పేర్కొంది. పార్లమెంట్‌లోని 113 స్థానాల్లో ఎనిమిది స్థానాలను తమ ఆధీనంలో ఉంచుకున్న టీపీపీతో కలిసి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తోంది.