AP Crime: ఆటోలో కూర్చునే విషయంలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య
- నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం
- కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి దారుణ హత్య
- ఆటో క్యాబిన్ లో కూర్చునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ
- ఫరూక్ కత్తితో ఖాజావలి అనే యువకుడి ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఎప్పుడు..? ఎలా? ప్రాణాలు పోతాయో తెలియదు అంటారు…? కానీ, ఇప్పుడు ఎప్పుడు..? ఎవరు? ఎలా ప్రాణాలు తీస్తారో కూడా తెలియడం లేదు.. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకోవడం వరకు వెళ్తున్నారు.. తాజాగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో దారుణం చోటుచేసుకుంది… ఓ చిన్నపాటి గొడవ చివరకు హత్యకు దారితీసింది. ఈ దాడిలో ఆత్మకూరు కు చెందిన ఖాజావలి అనే యువకుడి ఛాతిపై ఫరూక్ అనే వ్యక్తి కత్తితో పొడవటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
Read Also: CM Revanth Reddy: నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్.. కిష్టాపురం గ్రామానికి చెందిన మూర్తుజా అనే ఇద్దరూ కలిసి టాటా ఏసీ ఆటోలో సుదూర ప్రాంతాలకు వెళ్లి కవ్వ బన్ను వ్యాపారం చేస్తుంటారు.. అయితే రోజులాగానే నిన్న కూడా వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆటో క్యాబిన్ లో కూర్చునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం ఇద్దరూ ఎవరింటికి వారు చేరుకున్నారు. మళ్లీ కాసేపటికి ఫరూక్ మద్యం సేవించి మూర్తుజాకి ఫోన్ చేసి బూతులు తిట్టడంతో ఆత్మకూరు లోని తన మిత్రుడు అయినటువంటి ఖాజావలి మరో నలుగురుతో కలిసి కురుకుంద గ్రామానికి వెళ్లి ఫరూక్ తో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఫరూక్ కత్తితో ఖాజావలి అనే యువకుడి ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఫరూక్ పరారీలులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!