Free Condoms: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలోని యువతకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించారు. 25ఏళ్ల లోపు యువతీయువకులకు ఉచితంగా కండోమ్స్ అందించాలని ఫార్మసీలను ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఆ దేశంలోని యువతకు ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుకు ఉద్దేశం ఏంటంటే.. ఫ్రాన్స్ లో యువత ఎక్కువగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం కారణంగా అవాంఛిత గర్భధారణల సంఖ్య పెరిగిపోతుంది. దానితో యువత ఎక్కువగా జనన నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలా అవాంఛిత గర్భాలను తగ్గించేందుకు, యువతకు మెడికల్ షాపుల్లో ఉచితంగా కండోమ్‌లను అందజేయాలంటూ ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆదేశాలు జారిచేశారు.
Read Also: Shraddha Walkar Case: నా కూతురిని చంపినట్లే.. వాడిని ఉరి తీయండి
ఫ్రాన్స్ లో 2020- 21లో లైంగికంగా సంక్రమించే వ్యాధుల రేటు 30 శాతం పెరిగిందని అక్కడి నివేదికలు చెపుతున్నాయి. 2022 ప్రారంభం నుండి, 18- 25 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు గర్భనిరోధక మాత్రలు, గర్భసంచి లోపలే గర్భనిరోధక లూప్ (IUD)లు, గర్భనిరోధక ప్యాచ్‌లు, ఇతర దీర్ఘకాలిక గర్భనిరోధకాలు ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువతులు గర్భనిరోధకాన్ని వదులుకోకుండా నిరోధించడానికి 18 ఏళ్లలోపు వారి కోసం ఒక కార్యక్రమాన్ని విస్తరించిందని ఓ వార్త సంస్థ తన కథనంలో వివరించింది.
Read Also: Bhupendra Patel: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. మరోసారి 12న ప్రమాణం
ఎయిడ్స్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని ఎదుర్కోవడానికి ఇప్పటికే వైద్యుల సూచన మేరకే కండోమ్స్ ల విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పేర్కొంది. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించిన ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలుకానుంది. దీని ద్వారా యువత ఆరోగ్యకరమైన లైంగిక చర్యల్లో పాల్గొంటారని తద్వారా అవాంఛిత గర్బధారణలను, లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నిరోధించవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.
