Site icon NTV Telugu

ఆందోళన కలిగిస్తున్న కేరళ కరోనా కేసులు

ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న కొన్ని రాష్ట్రాల్లో జోరుగానే ఉంది. అక్కడక్కడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి కంట్రోల్‌లో లేదు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మాత్రం కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో సగం కేరళలోనే వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 25,010 కరోనా కేసులు నమోదు కాగా, 177 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2.37 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు 16.53 శాతంగా వుంది.

కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒకటే ప్రధాన అస్త్రమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే కోవిడ్‌ మ‌ర‌ణాల‌ను నివారించ‌డంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా ప‌ని చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ సింగిల్ డోస్‌తో 96.6 శాతం, రెండు డోస్‌తో 97.5 శాతం మ‌ర‌ణాల‌ను నివారించవచ్చని కేంద్రం వెల్లడించింది.

Exit mobile version