NTV Telugu Site icon

Good News: ఇక ప్రతీ ఇంట్లో పప్పు ఉడుకుతుంది

Toor Dal Dsc5051 500x350

Toor Dal Dsc5051 500x350

Good News: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.ఈ క్ర‌మంలో మార్కెట్‌లో ప‌ప్పుల ధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద మొత్తంలో ప‌ప్పుల‌ను దిగుమ‌తి చేయ‌నుంది.ఇలా చేయడం వల్ల దేశీయ మార్కెట్‌లో పెరిగిన పప్పుల ధరల నుంచి సామాన్యులకు విముక్తి లభిస్తుంది.

Read Also: SBI Loan: పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ

10 లక్షల టన్నుల పప్పు దిగుమతి..
దేశంలో పప్పు దినుసుల ధరలను నియంత్రించేందుకు దాదాపు 10 లక్షల టన్నుల కందులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.ఇటీవల కేబినెట్ సెక్రటరీ స్థాయిలో సీనియర్ అధికారుల సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది. గతేడాది డిసెంబర్ 2022లో సుమారు 2 లక్షల టన్నుల కందులను దిగుమతి చేసుకుంది కేంద్రప్రభుత్వం. దేశీయంగా లభ్యతను నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం 10 లక్షల టన్నుల వరకు కందులను దిగుమతి చేయబోతుంది.

పప్పుల దిగుమతి ఫలితంగా
పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడం ద్వారా దేశం పప్పు ధాన్యాల సరఫరాలో ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.మన దేశంలో చాలా వరకు కంది పప్పు తూర్పు ఆఫ్రికా, మయన్మార్ నుండి వస్తుంది.కంది పప్పు దిగుమతి‎కి మార్చి 31, 2024వరకు సాధారణ లైసెన్స్ కూడా వచ్చింది.

Read Also: Hema Malini: సింగర్‎గా మారిన అలనాటి అందాల నటి

ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గతేడాది కందిపప్పు దిగుబడి 43.4లక్షల టన్నులు ఉంది.2022-23 పంట సంవత్సరంలో (జూలై-జూన్) ఉత్పత్తి 38.9 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దిగుబడి తగ్గేందుకు కారణం గుల్బర్గ్ ప్రాంతాల్లోని వాతావరణమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.కరువుతో పాటు పంటకు అనేక రకాల వ్యాధులు సోకడంతో పంట నాశనమైందని, అందుకే ఈసారి పప్పు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.