NTV Telugu Site icon

Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటున్న ‘కమిటీ కుర్రోళ్లు’..

Committee Kurrollu

Committee Kurrollu

శ్రీ రాధ దామోదర్ స్టూడియో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ల పై నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. అలాగే సినిమాకి ఎద వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మలు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకునెల ఉన్నాయి.

AC usage: ఎక్కువ సమయం ఏసీ‌ వాడుతున్నారా..? ఆరోగ్యం గురించి డాక్టర్ల వార్నింగ్.

ఇకపోతే తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముందటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే పాటను విడుదల చేసారు. ఈ పాటను సింగర్ కార్తిక్ ఆలపించారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటలో మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ బాణీ బాగా క్యాచీగా, వినసొంపుగా, హాయిగా ఉన్నట్లుగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే.. మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలనిపించేలా కనపడుతుంది. ఇక అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌ గా రాజు ఎడురోలు వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్‌ గా అనుదీప్ దేవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. T – సిరీస్ ద్వారా “కమిటీ కుర్రోళ్ళు” పాటలు విడుదల అవుతున్నాయి.

Show comments