Raju Srivastava: హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఉదయం జిమ చేస్తుండగా గుండెపోటు వచ్చిందని.. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అతను జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. అతని శిక్షకుడు ఆయనను వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. అక్కడ ఆయనకు రెండుసార్లు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని మరో కమెడియన్ వెల్లడించారు.
Purna: పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇదుగో
దేశంలో గొప్ప హాస్యనటుడిగా ఆయన పేరుపొందారు. ఆయన 2005- 2017 మధ్య టీవీలో ప్రసారమైన కామెడీ టాలెంట్ షో “ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్”తో అభిమానులను సంపాదించుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా, షారూఖ్ ఖాన్ బాజీగర్, బాంబే టు గోవా వంటి బాలీవుడ్ చిత్రాలలో శ్రీవాస్తవ్ చిన్న పాత్రలు పోషించాడు.