Purna: టాలీవుడ్ నటి, డ్యాన్సర్ పూర్ణ త్వరలో ఒక ఇంటి కోడలు కాబోతుందన్న విషయం విదితమే. బడా వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో ఇటీవలే ఆమె ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం కూడా తెల్సిందే. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే గత మూడు రోజుల నుంచి ఈ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందని, పూర్ణ పెళ్లిని క్యాన్సిల్ చేసిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
కొన్ని పర్సనల్ కారణాల వలన పూర్ణ ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని వార్తలు రావడంతో అభిమానులు ఆమెను ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ పుకార్లు చివరకు పూర్ణ దగ్గరకు కూడా చేరడంతో ఆమె ఎట్టకేలకు ఈ రూమర్స్ కు చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్తను గట్టిగా హత్తుకున్న ఫోటోను షేర్ చేసిన పూర్ణ నువ్వు ఎప్పటికి నావాడివే అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. పుకార్లు అలాగే వస్తూ ఉంటాయి. అలాంటివి పట్టించుకోవద్దని,మీకు ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటామని పూర్ణ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం పూర్ణ పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లి తరువాత పూర్ణ నటిస్తుంది లేనిది తెలియాల్సి ఉంది.