NTV Telugu Site icon

Rohit Sharma: ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్.. అభిమాని ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇదే! (వీడియో)

Rohit Sharma Press Conference

Rohit Sharma Press Conference

Rohit Sharma React To Fan Question, Which IPL Team To Play: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ధీటుగా సమాధానం ఇస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. నాలుగో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి 344/3 స్కోరు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకంజలో ఉంది. లంచ్‌ బ్రేక్‌కు ముందు వర్షం రావడంతో చాలా సమయం ఆట నిలిచిపోగా.. ఇప్పుడే ఆరంభమైంది.

చిన్నస్వామి స్టేడియంలో వర్షం తగ్గిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించాడు. తిరిగి డగౌట్‌కు వస్తుండగా.. స్టాండ్స్‌లోని ఫాన్స్ ‘రోహిత్.. రోహిత్’ అంటూ అరిచారు. వారికి హిట్‌మ్యాన్ హయ్ చెప్పాడు. ‘ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్ భాయ్’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘నీకు ఏ టీమ్ కావాలి’ అని రోహిత్ సరదాగా అడిగాడు. అందుకు ఆ ఫ్యాన్ బదులిస్తూ.. ‘ఆర్సీబీకి వచ్చేయ్ భాయ్, లవ్ యూ భాయ్’ అని అన్నాడు. ఇంతలో రోహిత్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ తెలుగబ్బాయే! ఫుల్ డీటెయిల్స్ ఇవే

ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో.. రోహిత్ శర్మ సహా అభిమానులకు మింగుడుపడలేదు. ఐపీఎల్ సమయంలోనే హార్దిక్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు రోహిత్ మెగా వేలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేయాలని బెంగళూరును ఇటీవల మాజీ భారత బ్యాటర్ మహ్మద్ కైఫ్ కోరారు. పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింతా కూడా రోహిత్ కోసం భారీగా ఖర్చు చేస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబై రిటైన్ లిస్టులో హిట్‌మ్యాన్ ఉన్నాడని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

Show comments