గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున క్యాంపస్‌ల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో విద్యార్థులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడే విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 900 మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిరసనకారులపై ఆయా యూనివర్సిటీలు కొరడా ఝుళిపించాయి. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలోని అధికారులు నిరసన శిబిరాన్ని తొలగించాలని ఆదేశించాయి. లేకుంటే విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించాయి. తాజాగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు చేపట్టారు. పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను కూడా వాయిదా వేశాయి.
ఇది కూడా చదవండి: Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఊహించని రీతిలో దాడులకు తెగబడింది. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులు చేసింది. దీంతో 1,1700 మంది పాలస్తీనీయులు మృతిచెందారు. ఇప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. మరోవైపు మానవతా సాయం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి: Loksabha Elections : అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థులపై కొలిక్కి రాని కాంగ్రెస్ నిర్ణయం