దుంప జాతిలో చామ దుంప కూడా ఒకటి.. ఆలు కన్నా ఎక్కువగా వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..దుంప జాతి పంటలతో పోలిస్తే అధికంగా ఉంటాయి.ఏ కూరగాయలు అయిన కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు.. అందుకే రైతులు ఎటువంటి పంట అయిన ధర అనుకూలంగా ఉన్నా, లేకపోయినా అమ్ముకోవాల్సి ఉంటుంది. దుంప పంటలైన కంద, చామ అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్ లో ధర అనుకూలతను బట్టి 6 వారాలు ఆలస్యంగా కూడా తవ్వుకోవచ్చు.
ఇక ఈ దుంపలకు చీడ పీడలు సమస్య కూడా తక్కువే. కాని నీటి అవసరం ఎక్కువ. ఏడాది మొత్తం చామ దుంపకు మార్కెట్ లో ధర స్థిరంగా ఉంటుంది.చామ దుంపలతో పాటు వాటి ఆకులు, కాడలలో కూడా అధిక పోషకాలు ఉంటాయి. ఆకులను సైతం కూరగా వినియోగిస్తారు.చామ దుంపను ఏడాదికి రెండు సీజన్ లలో సాగు చేస్తారు. వర్షా కాలంలో జూన్ – జూలై మాసాలు చామ దుంప విత్తుకోవడానికి అనుకూలం. చామ దుంప నుంచి 8 నెలల పంట కాలంలో రకాన్ని బట్టి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు..
ఈ పంటకు వేడి వాతావరణం , నీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి..ఈ దుంపలకు మురుగు నీరు బయటకు పోవు సౌకర్యం కలిగిన నేలలు అనుకూలం.సేంద్రియ పదార్థం అధికంగా ఉండే నేలల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం కలదు..ఖరీఫ్ లో జూన్ – జులై మాసాలు, వేసవిలో ఫిబ్రవరి – ఏప్రిల్ మాసాలు విత్తుకొవడానికి అనుకూలం.. ఎటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలంటే..శతముఖి,భావపురి,K.C.S – 3 కో -1 రకాలు మేలైన రకాలు..ఒక ఎకరాకు 300-400 కిలోలు పిల్ల దుంపలు కన్నా తల్లి దుంపలు విత్తానంగా వాడితే దిగబడి పెరుగుతుంది. కొన్ని సార్లు విత్తన మోతాదు దుంపల సైజ్ ను బట్టి ఉంటుంది. దుంపల సైజ్ పెద్దగా ఉంటే ఎకరాకు 600-800 కిలోల వరకు పడుతుంది. తెగుళ్ళు లేని, ఆరోగ్యంగా ఉన్న,ఓకే సైజ్ కలిగిన, దెబ్బలు తగలకని దుంపలను విత్తనంగా ఎంపిక చేసుకోవాలి. తల్లి, పిల్ల దుంపలను విత్తన దుంపలుగా ఉపయోగించుకోవచ్చు..
ఇక ఈ దుంపలను నాటిన 2-3 నెలలో క్రొత్త దుంపలు ఏర్పడతాయి.5-7 నెలలలో దుంపలు పరిపూర్ణంగా వృద్ధి చెంది, తవ్వకానికి సిద్ధమవుతాయి.దుంపలు పక్వానికి వచ్చిన దశలో ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ దశలో నీటి తడులు తగ్గించాలి. వారానికి ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చి, ఆపై ఆపివేయాలి. దీంతో ఆకులు ఎండిపోతాయి. మార్కెట్ లో ధరలు లేని కారణాల వల్ల దుంపల తవ్వకాన్ని.. ఈ పంటలో సేంద్రియ పద్ధతులలో పంటలను పండిస్తే 12-20 టన్నుల వరకు దుంపల దిగుబడి వస్తుంది. రైతుకు సరాసరి కిలోకు 15 రూపాయల ధర లభించిన ఎకరాకు 12 టన్నుల దిగుబడి కి 1,80,000 రూపాయలు వచ్చే అవకాశం కలదు.. మొత్తంగా ఈ దుంపలను సాగు చేస్తే లాభాలే కానీ నష్టాలు లేవని చెప్పాలి.. ఇంకేదైనా తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవాలి..