NTV Telugu Site icon

Girls Videos Row: కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్

Khushbu

Khushbu

College Girls Nude Videos Row From Udipi In Karnataka: కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు ముస్లిం విద్యార్థినులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటూ బీజేపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ స్పందించి.. ప్రైవేట్ పారామెడికల్ కాలేజ్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే వాదనలను ఖండించారు. ఈ వివాదంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె అన్నారు.

Also Read: Tension in Cuddalore: తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేసిన తమిళనాడు సర్కార్

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ మీడియాతో మాట్లాడుతూ.. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా కాలేజ్ వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఇది ఒక విద్యా సంస్థ అని, ఇక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండకూడదన్నారు. ఉడిపిలోని నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌ని గురువారం సందర్శించిన ఖుష్బు సుందర్.. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాల్సిందిగా కోరుతూ యాజమాన్యంతో చర్చించారు. కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థినిని తోటి విద్యార్థినులే నగ్నంగా వీడియో చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విచారణలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి హోదాలో ఖుష్బూ సుందర్ కాలేజీకి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ ఘటనపై ఒక నిర్ధరణకు వచ్చే అవకాశం ఉందన్నారు.