Cold Wave in Telangana: రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా వరకు పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 10.3, మంచిర్యాల 10.9, ఆసిఫాబాద్ 11.4, నిర్మల్ 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో క్రమంగా చలితీవ్రత పెరుగుతుండడంతో నగరవాసులు గజగజ వణికి పోతున్నారు. శీతకాలం ప్రవేశంతోనే చలి సైతం విజృభింస్తుండడంతో నగరవాసులు హడలి పోతున్నారు. ఆక్టోబర్ చివరి వారంలో నగరంలో ఒక్కసారిగా పెరిగిన చలితో తీవ్రతతో ప్రజలు వణికిపోయారు. అయితే నవంబర్ 1 నుంచి కొంత తగ్గుముఖం పట్టిన చలి 19 నుంచి 20 డీగ్రీల మధ్య నమోదైంది. అయితే గత రెండు రోజుల నుంచి మళ్లీ చలి తీవ్రత నగరవాసులను ఇబ్బంది పెడుతోంది.
Love Marriage: కర్కశత్వం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం
సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు వీస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం వేళ కూడా పలు ప్రాంతాల్లో చలిగానే ఉంటోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో తెల్లవారు జామున పనుల నిమిత్తం బయటికి వెళ్లే వారు చలితో వణికిపోతున్నారు. అదేవిధంగా ఇళ్లలో సైతం చిన్నారులు, వృద్దులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
