WPL 2023: ఐపీఎల్ వర్సెస్ విమెన్స్ ఐపీఎల్..కెప్టెన్లు ఒకేవైపు..గమనించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ఐపీఎల్‌కు సంబంధించి పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీల ప్రకటన, ప్లేయర్ల వేలం ముగిసింది. మెన్స్ లీగ్‌లానే విమెన్స్ లీగ్ వేలానికి భారీ స్పందన లభించింది. ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. కాగా మహిళల తొలి ఐపీఎల్ వేలం తర్వాత భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఆయా ఫ్రాంచైజీల ప్రణాళికల ప్రకారం జరిగిందో తెలీదు కానీ.. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోనే ఉండటం విశేషం.
Also Read: Juliet Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర రూ.112 కోట్లు..!
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
సోమవారం జరిగిన వేలంలో హర్మన్‌ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకోగా.. రోహిత్ 2011 నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ ముంబైలో చేరే సమయానికి టీమిండియా కెప్టెన్‌గా లేడు. ఇటీవలే అతను కోహ్లీ నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్ల కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌లో చేరడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. హర్మన్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read: WPL 2023: బాబర్ కంటే మంధానాకే ఎక్కువ.. పాక్ క్రికెట్ లీగ్‌పై నెటిజన్ల ట్రోల్స్!
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని జెర్సీ నంబర్ 18 ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. సోమవారం జరిగిన వేలంలో ఆర్సీబీ విమెన్స్ జెర్సీ నంబర్ 18 స్మృతి మంధానాను 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. WPLలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక పురుషుల క్రికెట్‌లో జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లీ ఐపీఎల్ పుట్టుక నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు.
Also Read: Rohit Sharma: రోహిత్‌కు అందుకే సరైన గుర్తింపు దక్కలేదు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్ మరే ఇతర లీగ్‌ల్లోనూ క్రికెటర్ కోహ్లీలా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది లేదు. అయితే కోహ్లీకి ఒక్క లోటు మాత్రం ఉంది. అతను ఒక్కసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్లు, జెర్సీ నంబర్ 18 ఐపీఎల్‌లో వేర్వేరు జట్లుగా విడిపోవడం ఆసక్తికర పరిణామం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీల పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో WPLలో కూడా ఈ రెండు జట్ల మధ్య అంతే రసవత్తర పోరులు సాగే అవకాశం ఉంది. వేలంలో ఈ రెండు జట్లు ఎంచుకున్న ప్లేయర్లను గమనిస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ముంబైలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.1.80 కోట్లు)తో పాటు నటాలియా సీవర్ (రూ.3.20 కోట్లు), పూజా వస్త్రాకర్ (రూ.1.90 కోట్లు), యాస్తికా భాటియా (రూ.1.50 కోట్లు)లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇక స్మృతి మంధానా (రూ.3.40 కోట్లు), రిచా ఘోష్ (రూ.1.90 కోట్లు), ఎలీస్ పెర్రీ (రూ.1.70 కోట్లు), రేణుక సింగ్ (రూ.1.50 కోట్లు), సోఫీ డివైన్ (రూ.50 లక్షలు)లతో ఆర్సీబీ కళకళలాడుతోంది.
Also Read: Supreme Hero: ప్రేమలో పడమంటే… మత్తులో పడ్డావా రాజా?
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!