US Open Tennis 2023: యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా అమెరికన్ టీనేజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ.. అద్భుతంగా పుంజుకున్న గాఫ్ విజేతగా నిలవడం విశేషం.
యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అనంతరం కోకో గాఫ్ భావోద్వేగానికి గురైంది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని పేర్కొంది. కోకో గాఫ్ మాట్లాడుతూ… ‘నాకు షాకింగ్‌గా ఉంది. ఈ అనుభవం మాటల్లోని వర్ణించలేను. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డెన్‌లో ఓడిపోవడంతో తట్టుకోలేకపోయా. యూఎస్ ఓపెన్ 2023లో ఛాంపియన్‌గా నిలవడంతో అన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా సత్తాపై నమ్మకం లేని వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఈ విజయంలో మా నాన్న ప్రోద్బలం ఎంతో ఉంది’అని కోకో గాఫ్ తెలిపింది.
Also Read
గత జులైలో వింబుల్డెన్ 2023 తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన పట్టిన 19 ఏళ్ల కోకో గాఫ్.. ఇప్పుడు విజేతగా నిలవడం గమనార్హం. అమెరికా తరఫున యూఎస్ ఓపెన్‌ను గెలిచిన మూడో టీనేజర్‌గా గాఫ్ నిలిచింది. అంతకుముందు అస్టిన్, సెరెనా విలియమ్స్ అతిచిన్న వయసులో యూఎస్ ఓపెన్‌ను గెలిచారు. యూఎస్ ఓపెన్ గెలిచిన గాఫ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
barbie dreams 💞💁🏾♀️🏆 pic.twitter.com/N2yCuvgJI6
— Coco Gauff (@CocoGauff) September 10, 2023
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!