NTV Telugu Site icon

Cockroaches in IndiGo Flight: ఇండిగో ఫ్లైట్ లోని ఫుడ్ సెక్షన్ లో బొద్దింకలు.. కేంద్రం షోకాజ్ నోటీసులు..

Cockroaches

Cockroaches

Cockroaches: ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ సెక్షన్ లో బొద్ధింకలు కనిపించడం తీవ్ర అలజడి రేపుతుంది. విమానంలో శుభ్రతను పాటించడం లేదని వాదన వినిపిస్తున్నాయి. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్‌ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో ఫ్లైట్‌లో తనకు బొద్ధింకలు కనిపించాయని చెప్పుకొచ్చాడు. విమానంలో హైజీన్‌గా ఉంచాలన్న విషయాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డాడు. ఈ పోస్ట్‌ను ఇండిగో ఎయిర్ లైన్స్ అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు.

Read Also: Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌.. మాస్టర్‌మైండ్‌ సినీ నిర్మాత!

ఇక, ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటనపై IndiGo యజమాన్యం స్పందించింది. అప్పటికప్పుడు అన్ని విమానాలను క్లీన్ చేయించింది. పురుగులు లేకుండా డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేయించి.. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొనింది. అంతరాయం కలిగినందుకు తమను క్షమించాలంటూ ఆ ప్యాసింజర్‌ని ఇండిగో సంస్థ కోరింది. నెటిజన్లు మాత్రం ఈ విమానాయాన సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు బెస్ట్ సర్వీస్‌లు ఇచ్చిన ఇండిగో ఇప్పుడిలా ఎందుకు తయారైందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!

అయితే, ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇండిగో ఎయిర్ లైన్స్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విమానంలో సర్వ్ చేసిన శాండ్‌విచ్‌లలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు రావడంపై వైద్య శాఖ అధికారులు రియాక్ట్ అయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదు రావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 29 వ తేదీన నాణ్యత లేని ఆహార పదార్థాలు విమానంలో సప్లై చేయడంపై మండిపడింది.