CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. కేవలం వారం రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టేసింది. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన “కాక్రోచ్” (బొద్దింక) వ్యాఖ్య ఈ ఉద్యమానికి కారణమైంది. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారనే వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, తాను నకిలీ డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని, దేశ యువతపై తనకు ఎంతో గౌరవం ఉందని మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి స్పష్టతనిచ్చారు.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే మే 16న X (ట్విట్టర్) వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పోస్టర్‌ను, ఒక గూగుల్ ఫామ్‌ను షేర్ చేస్తూ.. “బొద్దింకలు” అనుకునే వారంతా ఇందులో చేరవచ్చని పిలుపునిచ్చారు. ఇది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది. లక్షకు పైగా మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు.
Also Read
రాజకీయ స్పందన..
ఈ వ్యంగ్య ప్రయోగానికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తాము కూడా ఇందులో సభ్యులమని ప్రకటించగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ “BJP vs CJP” అంటూ ట్వీట్ చేశారు.
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పెరిగినంతగా X వేదికపై ఫాలోవర్లు పెరగకపోవడం, విదేశీ బాట్ల ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదట సరదాగా ప్రారంభమైనా, ప్రస్తుతం ఇదొక యువ విప్లవంగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని వ్యవస్థాపకుడు అభిజీత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు