NTV Telugu Site icon

Cock in Lockup: రెండు రోజులుగా లాకప్‌లో కోడిపుంజు.. ఏం నేరం చేసిందో తెలుసా?

Cock In Lockup

Cock In Lockup

Cock Bird Found in Jadcherla Police Station Lockup: సాధారణంగా పోలీస్‌ స్టేషన్‌లోని లాకప్‌లో నేరస్థులు ఉంటారు. నేరాలు, ఘోరాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వేస్తారు. ఇందుకు బిన్నంగా లాకప్‌లో ఓ కోడిపుంజు ఉంది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా లాకప్‌లో ఉన్న కోడిపుంజు కూస్తూనే ఉందట. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని బురెడ్డిపల్లిలో ఇటీవల తరచుగా కోళ్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో గ్రామస్థులంతా కోళ్ల దొంగను పట్టుకునేందుకు నిఘా వేశారు. శనివారం రాత్రి కర్వెన ప్రాంతానికి చెందిన ఓ బాలుడు బురెడ్డిపల్లిలో ఓ కోడిపుంజును ఎత్తుకెళుతుండగా గ్రామస్థులు చూశారు. ఆ బాలుడు పారిపోతుండగా పట్టుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Also Read: America Richest Women List 2023: ఫోర్బ్స్ అమెరికా మహిళా సంపన్నుల జాబితా.. నలుగురు భారతీయులకు చోటు!

బాలుడు మైనర్‌ కావటంతో తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు పోలీసులు. ఇక కోడిపుంజు ఎవరిదో తెలియలేదు. కోడిపుంజు తమదే అని బురెడ్డిపల్లి నుంచి ఫిర్యాదు రాలేదు. దాంతో కోడిపుంజు బయట ఉంటే కుక్కలు దాడిచేస్తాయని భావించిన సీఐ రమేశ్‌ బాబు లాకప్‌లో పెట్టారు. అంతేకాదు దానికి గింజలు, నీరు ఏర్పాటు చేయించారు. ఠాణాకు వెళ్లిన వారంతా లాకప్‌లో ఉన్న కోడిపుంజును చూసి షాక్ అయ్యారు. పోలీసులు విషయం చెప్పడంతో సరదాగా నవ్వుకుంటున్నారు. కోడిపుంజుకు గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం బాగుందని అందరూ అనుకంటున్నారు.

Also Read: 2023 July Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. జులైలో ఒక శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి!

Show comments