గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Modi’s swearing-in: జూన్ 8న మోడీ ప్రమాణస్వీకారం..‘8’వ తేదీనే ఎందుకు.? కారణం ఇదే..
“యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా.. గత సెప్టెంబర్ లో ఆ ప్రాంతంలోనే స్వాధీనం చేసుకున్న కొకైన్ ప్యాకెట్ల మాదిరిగా ఉన్నాయని.. ఈ ఘటనపై ఏటీఎస్ తదుపరి విచారణను నిర్వహిస్తోందని బాగ్‌మార్ చెప్పారు. మరోవైపు.. పట్టుబడిన కొకైన్ ప్యాకెట్లు ఒక్కొక్కటి కిలోగ్రాము బరువు ఉందని.. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏటీఎస్ పోలీసు సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు.
Read Also: Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..
