Site icon NTV Telugu

Cyclone Alert: ఏపీకి దూసుకొస్తున్న తుఫాను.. ముందస్తుగా చర్యలు

Cyclone Alert

Cyclone Alert

Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో కేంద్ర కార్యదర్శులు, డిఫెన్స్ , డీజి ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డీజీ ఐఎండీలు పాల్గొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.

Read Also: Lavu Sri Krishna Devarayalu: అమిత్ షాతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

తుపాను హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామని చెప్పారు. ప్రజలను అవరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ ఆటంకం కలిగితే వెంటనే పునరుద్ధించడానికి అందుబాటులో సిబ్బంది ఉన్నారన్నారు.
విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ నుంచి వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) అమలు చేయాలని అధికారులకు సూచించామన్నారు.

Exit mobile version