NTV Telugu Site icon

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్..

Mlc Elections

Mlc Elections

ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూటమి నేతలు కలిసి కట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కోవడంపై రేపు ఇంఛార్జి మంత్రుల పర్యటనలు కొనసాగనున్నాయి.

READ MORE: Ajith Kumar : ‘విడాముయార్చి’ అడ్వాన్స్ బుకింగ్స్ అవుట్ స్టాండింగ్

అయితే, ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.. 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.. కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుతల ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు కృష్ణ – గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.. అయితే, మార్చి 29వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.. దీంతో.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల కమిషన్‌.. ఇక, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు పేరు ఖరారు చేశారు.. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పేరు ప్రకటించారు..

READ MORE: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. టోకెట్ల జారీలో మార్పులు..