CMD Prabhakar Rao:సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యుత్ పై సమీక్షకు ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు రావాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. అయితే ఈ సమీక్షకు సీఎండి ప్రభాకర్ హాజరుకాలేదు. సీఎండి ప్రభాకర్ పై సీఎం సీరియస్ అయినట్లు వార్తలు రావడంతో సిఎండి ప్రభాకర్ రావు స్పందించారు. ఈరోజు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటాను అని అన్నారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ.. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతా అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Read also: Animal Movie: యానిమల్ మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నతాధికారులు ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే వున్న ప్రభాకర్ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు.
దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. నిన్నటి నుంచి విద్యుత్ శాఖ అంశం పై సీఎం సీరియస్ గా వున్నారు. 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్న కూడా సమీక్ష రాకపోవడంతో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రభాకర్ రావు ఆహ్వానం అందలేదు అనడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావును పిలిచి విద్యుత్ పై చర్చ చేస్తారా? 85 వేల కోట్ల నష్టంపై వివరణ అడు లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Atchannaidu: మత్స్యకారులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం..