NTV Telugu Site icon

CM YS Jagan: రాయి దాడి ఘటనపై జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..

Jagan

Jagan

CM YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై రాయి దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనను ఖండిస్తూ.. చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. మరికొందరు.. దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.. అయితే, రాయి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని హెచ్చరించారు.. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదన్న ఆయన.. ఈ స్థాయికి వాళ్లు దిగజారారు అంటే మనం విజయానికి దగ్గరగా, వాళ్లు విజయానికి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలన్నారు.

Read Also: Congress Leader Dance: పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేత డ్యాన్స్.. ఇద్దరు పోలీసులు సస్పెన్షన్

ఈ తాటాకు చప్పుళ్లకు జగన్ అదరడు బెదరడు అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. నా నుదిటి మీద వారు చేసిన గాయం.. కంట్లో తగల్లేదు అంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడని పేర్కొన్నారు.. నా నుదిటి పై గాయం 10 రోజుల్లో మానుతుంది.. కానీ, చంద్రబాబు పాలనలో చేసిన గాయాలు, మోసాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. గాయపరచటం, కుట్రలు చేయటం చంద్రబాబు నైజంగా చెప్పుకొచ్చిన ఆయన.. ప్రజలకు మంచి చేయటం నా నైజం అని స్పష్టం చేశారు. ఇక, కృష్ణాజిల్లాలో ప్రజల సముద్రం.. మే 13న జరగనున్న మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన సముద్రమిది అని అభివర్ణించారు. పెత్తందారులతో యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read Also: Mr and Mrs Mahi: ధోనీపై జాన్వీ కపూర్ సినిమా.. రిలీజ్ డేట్ మారిందోచ్!

ఇక, ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు.. ప్రజలకు మంచి చేసిన ధైర్యంతో మీ ముందు ఉన్నాను అన్నారు సీఎం జగన్.. అబద్ధాలతో కోటలు కట్టిన వారంతా నాపై యుద్ధానికి దిగారు.. కుట్రలు, అబద్ధాలు, మోసాలతో నాపై దాడికి దిగుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎవరు ఎన్ని చేసినా జగన్ అదరడు, బెదరడు.. ప్రజలు అనే శ్రీకృష్ణుడు అండగా ఉన్న కృష్ణుడు నేను అన్నారు. ఇక, అర్జునుడిపై ఒక బాణం వేసినంతమాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్టు కాదు.. జగన్‌పై ఒక రాయి వేసినంత మాత్రాన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు.. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు అని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.