NTV Telugu Site icon

CM YS Jagan: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు.. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

Jagan

Jagan

CM YS Jagan: జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Read Also: Atrocious: శంషాబాద్ లో దారుణం.. బండరాళ్లతో మోదీ యువకుడి హత్య

ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ (వైఎస్సార్ పెన్షన్ కానుక) మొత్తాన్ని రూ.3000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పెంచిన మొత్తాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని పేర్కొంది. గత ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్‌ను రూ.3000 ఇస్తామని జగన్ ప్రకటించారు. దీనిలో భాగంగా దశలవారీగా పెన్షన్‌ను పెంచుతూ వచ్చారు ముఖ్యమంత్రి . అలా ప్రస్తుతం రూ.2,750గా వున్న పెన్షన్‌ను రూ.3000కు పెంచారు జగన్. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వున్న పెన్షన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , ట్రాన్స్‌జెండర్స్, వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు జగన్. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా పెన్షన్ పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని జగన్ ఇచ్చిన మాట నెరవేర్చినట్లయ్యింది.

Read Also: Ration Card E Kyc: ఆఖరు తేదీ ఆరోజే.. ఈ కేవైసీపై సర్కార్‌ ఉత్తర్వులు

జనవరి 1వ తేదీ నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నామని సీఎం జగన్‌ గతంలో పేర్కొన్నారు. ఈ ప్రభు­త్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నామన్నారు. పెన్షన్ల పెంపు సందర్భంగా జన­వరి 1 నుంచి 8వ తారీఖు వరకూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 2019లో మన ప్రభు­త్వం రాక ముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చా­­రన్నారు.