NTV Telugu Site icon

CM YS Jagan Tirupati Tour: రేపు తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటన..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan Tirupati Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిత్యం బిజీగా గడుపుతున్నారు.. ప్రతీరోజూ ఏదోఒక కార్యక్రమం.. అటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణపై కూడా ఫోకస్‌ పెడుతున్నారు.. ఇక, రేపు సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. పదిన్నరకు సూళ్లూరుపేట తడ మండలం మమ్ బెట్టా సెజ్ కు చేరుకుంటారు.. అక్కడ ఫిషరీస్, ఆర్ అండ్‌ బీ, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి సీఎం ప్రసంగం కొనసాగనుంది.. సభ అనంతరం గంట పాటు స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఇక, ఈ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Most Expensive Whiskey: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఇదే.. బాటిల్ ధర ఎన్ని కోట్లో తెలుసా?

మరోవైపు ఇవాళ మరో కీలక సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర విభజన పెండింగ్ అంశాల పై ఫోకస్ పెట్టనున్నారు.. విభజన చట్టం 13వ షెడ్యూల్ లోని సంస్థలు, పెండింగ్ అంశాల పై సమీక్ష సమావేశానికి సిద్ధం అయ్యారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.. కాగా, రాష్ట్ర విభజన తర్వాత అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని.. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నో విజయం విదితమే.