CM YS Jagan: నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. మరో సభ నిర్వహిస్తోంది. రాప్తాడులోని ఆటోనగర్ వద్ద 110 ఎకరాల్లో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ రాప్తాడు సిద్ధం సభతో మూడు సభలు పూర్తి కానున్నాయి. త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహించనున్నట్లు తెలిసింది.
Read Also: Bird Flu : ఆంధ్ర ప్రదేశ్ లోకి బర్డ్ ఫ్లూ ఎంట్రీ.. ఈ జిల్లాలో చికెన్ అమ్మకం నిషేధం
ట్రాఫిక్ ఆంక్షలు
సభ పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. ఇక.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమేనని.. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు.