NTV Telugu Site icon

YS Jagan: సీఎం జగన్ నామినేషన్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Jagan

Jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 25వ తేదీన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24వ తేదీన శ్రీకాకుళంలో మేమంత సిద్ధం బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందులకు వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ వైసీపీ నిర్వహించే బహిరంగలో జగన్ పాల్గొంటారు.

Read Also: Rakul Preet Singh : పెళ్లయ్యాక రకుల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి?

అయితే, ఈ నెల 22వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని సమాచారం. కాగా, వైఎస్ జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు, 2014లోనూ సతీశ్ కుమార్ పై జగన్ గెలిచారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా తెలుగు దేశం పార్టీ తరపున బీటెక్ రవిందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.