NTV Telugu Site icon

CM YS Jagan: చంద్రబాబు-పవన్‌ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మినట్టే..!

Jagan

Jagan

CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. చంద్రబాబు – పవన్ ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మడం – తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, దత్త పుత్రుడు ఇద్దరి పేర్లు చెబితే అక్క చెల్లేళ్లకు మోసం, వంచన గుర్తుకు వస్తాయి.. వివాహ వ్యవస్థకు కళంకం తెచ్చిన వ్యక్తి దత్తపుత్రుడని.. కార్లు మార్చినట్టు భార్యలను మార్చిన వ్యక్తి దత్తపుత్తుడు అని హాట్‌ కామెంట్లు చేశారు. మేనిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో రంగుల కాగితాలు చూపించి తర్వాత చెత్త బుట్టలో పడేయడం కాదు.. 2014 ఎన్నికల్లో జనసేన- టీడీపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి.. వైఫల్యాలను ఎత్తి చూపారు సీఎం.. పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తామని ప్రకటించారు.. బాబు వస్తున్నాడు.. రుణ విముక్తి చేస్తాడని ప్రకటనలు ఇచ్చి మరీ మోసం చేశారు అంటూ దుయ్యబట్టారు.

ఉమెన్ ప్రొటెక్ష న్ ఫోర్స్ సహా అన్ని వాగ్దానాలను బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా…? అని నిలదీశారు సీఎం జగన్‌.. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన టీడీపీ ప్రభుత్వం.. మహిళా జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. చంద్రబాబు అంటే మోసం.. మోసం.. దగా.. దగా.. అని ఫైర్‌ అయ్యారు. ఇక, టీడీపీ – జనసేన మహాశక్తి పేరుతో మోసానికి తెరతీశాయి.. దేవతల పేరుతో వాగ్ధానాలు చేసి మోసం చేయడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అబద్ధపు వాగ్ధానాలు, మోసాలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు.. ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు.. బీసీల అభివృద్ధికి చంద్రబాబు చేసింది శూన్యం అన్నారు.

ఇక, ప్రజలే నాకు స్టార్ కెంపైనర్లు అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. ఎన్నికల సమయంలో చంద్రబాబు-పవన్‌ వచ్చి.. మేం అధికారంలోకి వస్తే కేజీ బంగారం. బెంజి కారు కూడా ఇస్తామంటూ మోసపు మాటలు చెప్పేందుకు మీ ముందుకు వస్తారని హెచ్చరించారు. మీ బిడ్డ ప్రభుత్వానికి గత పాలనకు వ్యత్యాసం చూడమని అడుగుతున్నాను.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు.. ఇద్దరు తమ్ముళ్లు.. అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగుతుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను.. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.